అభిమాన హీరో సినిమాను విడుదలైన మొదటిరోజు, మొదటి ఆట చూడాలనుకున్నాడో అభిమాని. టికెట్‌ను ఏకంగా రూ. లక్ష పెట్టి కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తన అభిమాన హీరో ఎవరో కాదు.. దివంగత నటుడు అంబరీశ్, సుమలతల కుమారుడు అభిషేక్. అతను హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమకు ‘అమర్’ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా గురువారం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు చాలా పెరిగాయి. ఈ నేపథ్యంలో దావణగిరెకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి తన కుమారుడికి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు.
ఇందుకోసం ‘అమర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్‌ను రూ. లక్ష పెట్టి కొనుగోలు చేశాడు. అయితే మంజునాథ్‌కు సందేశ్ ప్రొడక్షన్ అనే ఓ నిర్మాణ సంస్థ కూడా వుంది. ఈ సంస్థ మీదే టికెట్ కొనుగోలు చేశాడట. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో అంబరీశ్ అతిథి పాత్రలో నటించారు. తన కుమారుడి తొలి సినిమా కావడంతో మొత్తం సినిమా చూడాలని అంబరీశ్ ఆశపడ్డారు కానీ.. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. ఇదిలావుండగా అంబరీశ్ సతీమణి సుమలత.. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa