టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తునట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా "OG" ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా రాజకీయ కమిట్మెంట్ల కారణంగా నిలిపివేయబడిన అనేక ప్రాజెక్ట్‌లలో ఒకటి. సెప్టెంబరులో పవన్ చిత్రీకరణను పునఃప్రారంభించాలని భావిస్తున్నప్పటికీ, అతని దృష్టి చాలా కాలంగా వాయిదా పడిన "హరి హర వీర మల్లు"పైనే ఉంటుంది. "OG" మరియు "ఉస్తాద్ భగత్ సింగ్" అభిమానులు ఆ సెట్లలో పవన్‌ని తిరిగి చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ఈ నిరీక్షణ మధ్య, యువ నటి ప్రియాంక మోహన్ ఒక అప్డేట్ ని అందించారు. తన రాబోయే యాక్షన్ డ్రామా "సరిపోదా శనివారం" ప్రమోషన్ల సందర్భంగా, "OG" యొక్క ముఖ్యమైన భాగం ఇప్పటికే పూర్తయిందని ప్రియాంక వెల్లడించింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి రావడానికి ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అని వెల్లడించారు. ఈ ఉత్తేజకరమైన గ్యాంగ్స్టర్లో పవన్ కళ్యాణ్‌ను తిరిగి పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.