వైవిధ్యమైన కథలు, పాత్రలతో మెప్పిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ నటుడు ఆది పినిశెట్టి. తర్వలోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం అవుతుందని చిత్ర వర్గాలు చెపుతున్నాయి. . ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది
ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకున్నాడనేదే ప్రధాన కథాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఆది పాత్ర గురించేందుకు బైటకు తెలిపిఏందుకు నిరాకరించిన నిర్మాతలు . ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa