శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రెండు చార్ట్-టాపింగ్ సింగిల్స్‌తో "దేవర" సెన్సేషన్ సృష్టించింది. "ఫియర్ సాంగ్" మరియు రొమాంటిక్ "చుట్టమల్లె" తరువాత మూడవ సింగిల్ "దావుడి" సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాట ఒక ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్. ఈ పాట విజువల్ ఫీస్ట్, అనిరుధ్ యొక్క ఎనర్జిటిక్ బీట్స్ మరియు జాన్వీ కపూర్ గ్లామరస్ ప్రెజెన్స్‌తో ఎన్టీఆర్ యొక్క ఆకర్షణీయమైన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 35 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.