ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెజిఎఫ్ దర్శకుడితో జూ.ఎన్టీఆర్ సినిమా!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2019, 08:34 PM

కెజిఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాగా ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . దానికి తోడు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు . ఈ సినిమా కంప్లీట్ అవ్వడం అంటే 2020 జూన్ అన్నమాట . అంటే ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా రానుంది . ఈలోపు కేజీఎఫ్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్ . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలవ్వడం ఖాయమే !


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa