ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క సీన్ కోసం 45 కోట్లా ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 11:41 AM

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది.

ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 45 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారట. విజువల్ వండర్ గా అనిపించే ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa