హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.సమాజంలో జరిగే ప్రతి చెడుపై తనదైన శైలిలో గళం విప్పి బాధితుల పక్షాన నిలుస్తోంది.కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయంపై..పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. " నిందితుడు 'షేక్ జానీ'ని ఇకపై..జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు..'మాస్టర్' అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని ట్వీట్ వేసింది. దీంతో పూనమ్ కౌర్ ట్విట్టర్ X లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పూనమ్ ట్వీట్‌కు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు.జానీ మాస్టర్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కొరియాగ్రఫర్రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిసిన విషయం తెలిసిందే.