ఇండస్ట్రీ ఎదురుకొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల పై ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఓ వైపు మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ రచ్చ లేపుతోంది.చాలా మంది తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ దైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకొక్కరుగా నటీమణులు బయటకు వస్తున్నారు. అలాగే తాజాగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు అంటూ ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై నటి శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో పలు లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ అమ్మడు ఆ తో సూపర్ హిట్ అందుకోవడమతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శ్రద్ధా శ్రీనాథ్ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోను లు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో జెర్సీతో పాటు జోడి, కృష్ణ అండ్ హిజ్ లీలా, సైంధవ్ ల్లో నటించి మెప్పించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్య గురించి మాట్లాడుతూ.. తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది. నేను ఇండస్ట్రీలో ఇప్పటివరకు సేఫ్ గానే ఉన్నాను. అయితే అందరూ నాలా సేఫ్ గా ఉన్నారని కాదు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా అదృష్టం బాగుండి నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవలేదు. అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొంతమంది ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అరికట్టేందుకు.. ఓ ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలి. మహిళలకు భద్రత కల్పించాలి అని శ్రద్ధా శ్రీనాథ్ కోరారు.