తెలుగు తెరపై విలక్షణ నటుడిగా అజయ్ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "నటనలో శిక్షణ తీసుకున్న తరువాత నాకు 'కౌరవుడు' సినిమాలో తొలి అవకాశం వచ్చింది. ఆ తరువాత 'ఖుషీ' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో స్టూడెంట్ పాత్ర కోసం పవన్ గారే నన్ను ఎంపిక చేశారు. ఈ పాత్ర నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఆ తరువాత వరుసగా సాఫ్ట్ కేరక్టర్స్ చేస్తూ వచ్చాను. అలాంటి పరిస్థితుల్లోనే రాజమౌళిగారు 'విక్రమార్కుడు' సినిమాలో విలన్ గా నాకు అవకాశం ఇచ్చారు. ఆ పాత్రను ఆయన చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బహుశా అలాంటి పాత్రను మళ్లీ చేసే అవకాశం రాదేమో. ఈ పాత్ర నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ పాత్ర నుంచి నాకు వచ్చిన క్రెడిట్ అంతా కూడా రాజమౌళిగారికే చెందుతుంది" అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa