ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పించిన కొండా సురేఖ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 09:27 PM

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ  తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత  విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. అలాగే మరో యంగ్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్  అంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆరే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అలాగే సినీ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. బాపూఘాట్‌లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘‘కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటు.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే. కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. వారికి మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటుపడి వాళ్లకూ అలవాటు చేశారు. రేవ్ పార్టీలు చేసుకుని వాళ్లని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. బీఆర్ఎస్ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. హరీశ్ రావు మనస్సున్న మనిషిగా స్పందించారు. నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్ పోస్టులు పెడుతున్నారు’’ అని సురేఖ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com