ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా ఆడవారికి కూడా గౌరవం ఇవ్వండి

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 09:25 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై ఆరోపణలు గుప్పిస్తూ.. సినిమా ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్ల పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ తాజాగా అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేఖను కోరుతూ.. ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ట్విట్టర్ వేదికగా.. కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించారు.


తాజాగా నటి హేమ ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ కామెంట్స్‌పై స్పందించారు. హేమ ఏమన్నారంటే.. ‘‘సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో.. ఆత్మగౌరవాన్ని ఇస్తున్నారో అలాగే సినిమా ఆడవారికి కూడా గౌరవం ఇవ్వండి’’ అంటూ హేమ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు ఆమె మంత్రి కొండా సురేఖను, కింగ్ నాగార్జునను, ‘మా’ను, ప్రకాశ్ రాజ్‌ను, సమంతను ట్యాగ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సినిమా ఇండస్ట్రీ నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెటిజన్లు కూడా అంత పబ్లిగ్గా అలా ఎలా అనేస్తారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే భయటపెట్టి అప్పుడు మాట్లాడండి కానీ.. ఇలా లేనిపోని ఆరోపణలను చేసి.. సెలబ్రిటీల‌ పరువును సోషల్ మీడియాలో పెట్టవద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com