ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 09:23 PM

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరయ్యారు. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్‌లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆమె ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు (గురువారం) జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు తీర్పును వెల్లడించనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com