తమిళ నటి వనిత విజయకుమార్ నాలుగో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. చాలాకాలం నుంచి తనకు తెలిసిన కొరియోగ్రాఫర్‌తోనే ఏడడుగులు వేయబోతుంది. అక్టోబరు 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రముఖ నటుడు విజయ కుమార్ పెద్ద కూతురు వనిత. 1995లో ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించింది.
2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇరువురు విడాకులు తీసుకున్నారు. తదుపరి కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొన్నాళ్లపాటు సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ బంధం ముగిసింది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరిగిందని వనిత ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. అయితే గతంలో సహజీవనం సాగించిన కొరియోగ్రాఫర్ రాబర్ట్‌నే ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుంది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమెకు కూతురు జోవిక ఉంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.