మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ థ్యాంక్స్ చెప్పారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ‘ఎక్స్’ ద్వారా రజనీకాంత్ స్పందిస్తూ.. ‘‘నా హెల్త్ పట్ల ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి.. ఫోన్ చేసి మరీ పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్‌కు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌కు కూడా ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన కోసం ప్రార్థించిన అభిమానులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.