రాజ రాజ చోర’తో భారీ విజయం అందుకున్నారు శ్రీ విష్ణు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హసిత్ గోలితో మరో చిత్రం శ్వాగ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
Swag Review: శ్రీవిష్ణు నటించిన ‘శ్వాగ్’ ఎలా ఉందంటే..
సినిమా రివ్యూ: ‘శ్వాగ్’
విడుదల తేదీ: 4–10–2010
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూవర్మ, దక్ష నగార్కర్, శరణ్య, పృథ్వీ, గోపరాజు వెంకటరమణ, రవిబాబు, సునీల్, గెటప్ శ్రీను తదితరులు.
సాంకేతిన నిపుణులు:
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: హసిత్ గోలి
'రాజ రాజ చోర’తో భారీ విజయం అందుకున్నారు శ్రీ విష్ణు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హసిత్ గోలితో మరో చిత్రం శ్వాగ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. శ్రీవిష్ణు ఇందులో డిఫరెంట్ రోల్స్ చేశారు. ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ తర్వాత హ్యాట్రిక్ కొట్టాలనే తపనతో చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? శ్రీవిష్ణు కోరిక తీర్చిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.భవభూతి (శ్రీవిష్ణు) ఎస్సైగా రిటైర్ అవుతాడు. విధి నిర్వాహణలో పలు కారణాల వల్ల ఆయనకు రావలసిన పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ రాకుండా ఆయన పైనున్న మహిళా అధికారి అడ్డుకుంటుంది. అదే సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్లతో కూడిన నిధి ఉందని తెలుస్తుంది. ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వెళతాడు భవభూతి. అతనికి అక్కడ అనుభూతి (రీతూ వర్మ) కనిపిస్తుంది. శ్వాగణిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన ఓ పురాతన పలక ఆమె దగ్గర ఉంటుంది. ఆ పలక అనుభూతి దగ్గరికి ఎలా వచ్చింది. సింగ (శ్రీవిష్ణు) ఎవరు? ఒకే రూపురేఖలతో ఉన్న భవభూతి, సింగకు మధ్య సంబంధం ఏంటి? వాళ్లకు ఆస్తి రాకుండా చేసిన యయాతి (ట్రాన్స్‌జెండర్ శ్రీ విష్ణు) ఎవరు? అతను ఏం చేశాడు? 1551 సమయంలో మగాళ్లని తన కాలి కింద చెప్పుల కింద చూసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)ని మాయ చేసి పురుషాధిక్యం పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది? అనేది కథ.