మంచు మనోజ్ సరసన 'ప్రయాణం' అనే తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 'ఊసరవెల్లి' చిత్రం కూడా కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా ఆఫర్స్ తలుపు తడతాయని అందరూ అనుకున్నారు.అయితే ఈ అందాల భామ తెలుగులో కేవలం రెండు చిత్రాల్లోనే నటించి.. ఆ తర్వాత కనుమరుగైంది. కన్నడంలో ఒక్క చిత్రం.. తెలుగులో కేవలం రెండు చిత్రాల్లో నటించిన పాయల్ ఘోష్.. దాదాపుగా 2011 నుంచి 2017 మధ్య ఆఫర్స్ లేక ఆరేళ్లు ఖాళీగా ఉంది. ఇక అనంతరం హిందీలో పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా, ఫైర్ ఆఫ్ లవ్ : రెడ్ వంటి చిత్రాల్లో నటించింది పాయల్ ఘోష్.అలాగే హిందీలో ఒక సీరియల్ కూడా నటించింది ఈ భామ. కాగా, ఆ తర్వాత ల నుంచి పూర్తిగా తప్పుకుంది ఈ బ్యూటీ. 2020లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక అదే ఏడాది అక్టోబర్‌లో రాంధాస్ అథవాలే చెందిన రాజకీయ పార్టీలోకి చేరింది పాయల్. వెంటనే మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితులైంది.