ఇటీవల ప్రతినిథి2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు అవుతున్నారు. ఈ నెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్టు సమాచారం.ప్రస్తుతం నారా రోహిత్ వయస్సు 40 ఏళ్లు. లేటు వయస్సులో పెళ్లి చేసుకోనున్న ఈ నారా వారి అబ్బాయితో జతకట్టే వధువు ఎవరనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఈనెల 13న హైదరాబాద్‌లోనే జరగనున్న నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ హాజరవుతారని తెలుస్తోంది. కాగా, నారా రోహిత్ తో రీసెంట్ మూవీలో నటించిన అమ్మాయే పెళ్లి కూతురు అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. క్లారిటీ రావాల్సి ఉంది.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా నారా రోహిత్ టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం 'సుందరకాండ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. విర్తి వాఘని హీరోయిన్. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్‌లో ఇది 20వ చిత్రం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa