ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కంగువ' వైజాగ్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 06:36 PM

పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ కోలీవుడ్ స్టార్ సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. అలాగే బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్ మరియు దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14 న విడుదల కానుంది. విడుదల రోజు సమీపిస్తున్న కొద్దీ సినిమాపై హైప్ మరియు అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ వైజాగ్ లో రేపు అంటే అక్టోబర్ 27న సాయంత్రం 5 గంటలకి RK బీచ్ రోడ్ గోకుల్ పార్క్  లో మీట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌లపై ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa