ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్‌3పై త‌మిళ నాడు కోర్టులో పిటిష‌న్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2019, 08:53 PM

ఇటీవ‌ల కాలంలో ద‌క్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో `బిగ్ బాస్‌3`. ఈ రియాలిటీ షో ప్ర‌సారంపై స్టే విధించాలంటూ కోర్టులో పిటిష‌న్ వేశారు. అదేంటి ఇంకా స్టార్టే కాలేదు. అప్పుడే పిటిష‌నా? అని ప్రేక్ష‌కుల‌కు అనుమానం రావ‌చ్చు. కానీ ఈ రియాలిటీ షోపై పిటిష‌న్ వేసింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. త‌మిళ నాడులో. క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా ఈ నెల 23 నుండి విజ‌య్ టీవీలో త‌మిళ `బిగ్ బాస్‌3` ప్రారంభం కానుంది. 
ఈ నేప‌థ్యంలో కార్య‌క్ర‌మంతో పాటు దాన్ని నిర్వ‌హిస్తున్న విజ‌య్ ఛానెల్‌పై మద్రాస్ హైకోర్టులో న్యాయ‌వాది సుద‌న్ పిటిష‌న్ వేశారు. కార్య‌క్ర‌మంలో పాల్గొనే స‌భ్యులు అశ్లీలంగా దుస్తులు వేసుకుంటున్నార‌ని, డ‌బుల్ మీనింగ్ ప‌దాల‌తో మాట్లాడుతున్నార‌ని అందులో పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం త‌ల్లిదండ్రుల‌కు సంకోచాన్ని క‌లిగిస్తున్న‌ద‌ని , ప్ర‌సారం చేయ‌డానికి ముందు సెన్సార్ బోర్డుతో కార్య‌క్ర‌మాన్ని చెక‌ప్ చేయాల‌ని పిటిష‌న్‌లో తెలిపారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై కోర్టు ఎలా స్పందిస్తుందో .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa