ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది నాకు కొత్త ప్రపంచం : మానస వారణాసి

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 11:16 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు అశోక్ గల్లా నటించిన సెకండ్ మూవీ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమాతో మిస్ ఇండియా టైటిల్ కొట్టిన మానస వారణాసి హీరోయిన్‌గా తెలుగులోకి కొత్తగా పరిచయం అవుతోంది. మరి మానస వారణాసి ఇంట్రెస్టింగ్ విషయాల్లోకి వెళితే..సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం.నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో మానస వారణాసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. నవంబర్ 22 దేవకి నందన వాసుదేవ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతోపాటు తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది హీరోయిన్ మానస వారణాసి


నేను హైదరాబాదులోనే పుట్టాను. టెన్త్ క్లాస్ వరకు మలేషియాలో చదువుకున్నాను. హైదరాబాదులో ఇంజనీరింగ్ చేశాను. కార్పొరేట్‌లో జాబ్ చేశాను. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మిస్ ఇండియా టైటిల్ గెలిచాను. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాని రిప్రజెంట్ చేశాను.


-ఆ తర్వాత జాబ్ చేసుకోవాలా? ఈ అవకాశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలా? అని అలోచిస్తున్నుపుడు మూవీ వర్క్ షాప్స్‌కి వెళ్లాను. అక్కడ సినిమా మీద పాషన్ పుట్టింది. అక్కడే యాక్టింగ్‌పై కాన్ఫిడెన్స్ వచ్చింది. కొన్ని అడిషన్స్ ఇచ్చాను. సినిమా గురించి నేర్చుకుంటున్నాను. ఇది నాకు కొత్త ప్రపంచం.


-దేవకి నందన వాసుదేవ లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. ఒక డెబ్యు యాక్టర్‌గా ఈ యూనిట్‌తో పనిచేయడం చాలా అదృష్టం. ఈ సినిమా కోసం చాలా ఎగ్జయిటెడ్‌గా ఎదురుచూస్తున్నాను


ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండనుంది?


-నా క్యారెక్టర్ పేరు సత్యభామ. తను విజయనగరం అమ్మాయి. ఈ సినిమా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. సత్యభామ వెరీ ప్లే ఫుల్, లవ్ బుల్, మిస్టీరియస్ గర్ల్. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంతో నిలబడే అమ్మాయి. ఇది పర్సనల్‌గా నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. కథలో నా పాత్ర వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కథలో నాది వెరీ కీ రోల్.


ఇది మీ ఫస్ట్ సినిమా కదా. మీరెదురుకున్న ఛాలెంజెస్ ఏమిటి?


-ఫస్ట్ మూవీ ఎప్పుడూ ఛాలెంజ్‌గానే ఉంటుంది. సెట్స్‌లో వాడే పదాలు, డైరెక్టర్ వాడే పదాలు, సినిమా లాంగ్వేజ్ వీటన్నిటినీ ఆన్ స్పాట్ నేర్చుకోవాలి. స్పాంటేనియస్‌గా ఉండాలి. అలాగే సత్య భామ పల్లెటూరి అమ్మాయి. ఆ బాడీ లాంగ్వెజ్, స్లాంగ్‌ని వోన్ చేసుకోవడం కూడా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. ఇది రోలర్ కోస్టర్ లాంటి రైడ్. నాకు బిగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను.


అశోక్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ?


- అశోక్ గారు వెరీ ప్రొఫెషనల్. సినిమా అంటే చాలా పాషన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందం ఇచ్చింది. సెట్స్‌లో చాలా విషయాల్ని షేర్ చేసుకునేవారు. మహేష్ గారి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్న విషయాలు చెప్పేవారు. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com