ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరకట్టులో అందంగా పాయల్ రాజ్ పుత్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 11:51 AM

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్‎లో డిప్లొమా చేసింది.అలాగే ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ భామ.తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న ఈ బ్యూటీకి చిన్నతనం నుంచే నటన పై ఆశక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత చిత్రసీమలో అడుగుపెట్టింది. ముందుగా బుల్లితెరపై తన కెరీర్ మొదలుపెట్టింది ఈ వయ్యారి భామ.2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ సీరియల్ లో సోనాక్షిగా టెలివిజన్ లో తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్‌, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించింది.2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబి చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రలో సీని అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2018లో వీరే కి వెడ్డింగ్ అనే ఓ హిందీ లో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ భామ.తర్వాత 2018లో ఆర్ఎక్స్100 అనే చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జోడిగా తెలుగు చిత్రం పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తర్వాత వెంకటేష్ సరసన వెంకీ మామ లో కథానాయకిగా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే చిత్రంతో ఆకట్టుకుంది.



 



 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com