తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ టాప్ నాచ్. బార్బర్‌గా, సగటు తండ్రిగా ఆయన యాక్టింగ్ సింప్లీ, సూపర్బ్. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ కావడంతో నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా బొమ్మను హిట్ చేశారు. ఈ సినిమాను కర్మ అండ్ రిట్రీబ్యూషన్ పేరుతో చైనాలో రిలీజ్ చేస్తే అక్కడి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. మౌత్ టాక్‌తో దూసుకెళ్లిపోతుంది. నవంబర్ 29న 40 వేల స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ జస్ట్ పది రోజుల్లోనే 55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. 12 రోజుల్లో సుమారు 70 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. చైనాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకు దక్కలేదు. 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ చిత్రంగా మహారాజా నిలిచింది. ఇక చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 13వ చిత్రంగా రికార్డులు సృష్టించింది. అంతేకాదు తమిళ ఇండస్ట్రీ నుండి హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన తొలి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో మెర్సల్, రోబో లాంటి సినిమాలు ఈ మేర ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రేర్ రికార్డు మక్కల్ సెల్వన్ సృష్టించినట్లయ్యింది. చైనా మార్కెట్‌లో కోలీవుడ్ సత్తా చాటి.. మరిన్ని ఇండియన్ సినిమాలకు మార్గం చూపించినట్లయ్యింది.