‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. 11 రోజుల్లో రూ.1409 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీపై ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ పెట్టిన 5 వారాల డీల్ ప్రకారం జనవరి 8 లేదా 9న స్ట్రీమ్ అవుతోందని తెలిసింది. సంక్రాంతి సమయంలో మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది. తొలి వారంలోనే దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన సినిమాపు పుష్ప 2 నిలిచింది. అంతేకాదు 2024లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ 2, కల్కి 2898 ఏడీలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది.