తమిళ సీనియర్ హీరో అజిత్, త్రిష జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'విడా ముయార్చి'. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 2025 జనవరిలో పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకుడు. 'విడా ముయార్చి' చిత్రంలో అర్జున్, సంజయ్ దత్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. గత నెలలో వచ్చిన టీజర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ రోల్ పోషించినట్టు ఈ చిత్ర అప్ డేట్స్ చెబుతున్నాయి.గతంలో అజిత్, త్రిష కాంబోలో వచ్చిన ఎన్నై అరిందాల్ (తెలుగులో 'ఎంతవాడు గానీ') చిత్రం భారీ విజయం సాధించింది. ఈ హిట్ పెయిర్ విడా ముయార్చి కోసం మరోసారి కలిశారు. ఈ సినిమా కూడా సక్సెస్ గ్యారంటీ అని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.