వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతున్న ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మి ఒకరు. ఆవిడ చూపుల్లో ఓ మత్తు ఉందని ఆడియన్స్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు రాయ్ లక్ష్మి వచ్చారు.తెలుగు టీవీలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఆ స్టేజిపై రాయ్ లక్ష్మి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు.రీసెంట్ టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ కు రాయ్ లక్ష్మి డ్యాన్స్ చేశారు. స్టేజిపై ఆవిడ కనిపించింది కాసేపే అయినా సరే రాయ్ లక్ష్మి దుమ్ము దులిపేశారు. తన స్టెప్పులతో అదరగొట్టేశారు.తెలుగులో కథానాయికగా సినిమాలు చేయడంతో పాటు కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు రాయ్ లక్ష్మి. సినిమాల కంటే ఆ పాటలే ఆమెకు ఎక్కువ పేరు తెచ్చాయి. ఇప్పుడు రాయ్ లక్ష్మి తెలుగు సినిమాలేవీ చేయడం లేదు. రాయ్ లక్ష్మితో పాటు మిగతా హీరోయిన్ల గ్యాలరీలకు... రాజకీయ, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.