పొలిటికల్ సునామీ ఎలా ఉంటుందో చూపించిన లీడర్ , ప్రభంజనం అంటి పదాలే నిబ్బురుపోయేలా చేసిన నాయకుడు, దేశమంతా జగన్ వైపు చూసి శభాష్ అనేసింది. కానీ టాలివుడ్ కి మాత్రం ఏమైంది ? ఏపీ ఎన్న్నికల వార్ లో దేశ0 మొత్తాన్ని ఆకర్షించింది. ఇప్పటిదాకా టీడీపీ ఇంత ఘోరమైన ఓటమి చూడలేదు.ఏపీ సిఎం గా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు దాటిపోయి౦ది, కానీ ఇప్పటికి టాలివుడ్ పెద్దలు అభినందించలేదు. మా అసోసియేషన్ గాని, నిర్మాతల మండలి గానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ గానీ ఎవ్వరూ జగన్ ను కలవలేదు. దీంతో జగన్ ను సిఎంగా గుర్తించడానికి ఇష్టపడడం లేదా ? అనే చర్చ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా, రాజకీయ నాయకుల్లోనూ జోరుగా సాగుతోంది.
గతేడాది టిఆర్ఎస్ ఘనవిజయం సాధించిన తరువాత కేసిఆర్ ను టాలివుడ్ పెద్దలంతా వెళ్లి అభినందించారు. చిత్ర పరిశ్రమకు సబంధించిన సమస్యలు చెప్పుకొని పరిష్కరించమని కోరారు. 2014 లో ఏపీ సిఎం గా ఎన్నికైన చంద్రబాబును కూడా టాలివుడ్ ఆయనను కలిసి అభినందించింది. కానీ జగన్ దగ్గరకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది చిత్ర పరిశ్రమ నుంచి ఎవ్వరూ ఇప్పటి దాక కలవలేదు. దీంతో జగన్ ను ఏపీ సిఎం గా టాలివుడ్ గుర్తించలేదా అనే దిస్కర్షన్ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa