ఐదు పదుల వయసులోనూ తన ఫిట్‌నెస్, శరీరాకృతితో ఫ్యాన్స్ ను అబ్బుర పరుస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. అక్షయ్ ఓ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. దాని పేరే.. బాటిల్ క్యాప్ ఛాలెంజ్. తన రోల్‌మోడల్ అయిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జేసన్ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటంటే.. ఓ టేబుల్‌పై బాటిల్ పెట్టాలి. దాని మూతను బాటిల్‌కు పూర్తిగా తిప్పి పెట్టకూడదు. కొద్దిదూరంలో నిలబడి కాలితో బాటిల్ క్యాప్‌ను తన్నాలి. అయితే ఈ ప్రక్రియలో ఆ బాటిల్ కిందపడకూడదు. ఈ ఛాలెంజ్‌లో అక్షయ్ విజయవంతం అయ్యారు. అంతేకాదు దీనిలో పాల్గొన్న తొలి భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని అక్షయ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa