రాయ్‌లక్ష్మి అనగానే గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరుగా భావిస్తారు. ఇప్పటివరకు ఆమె కెరీర్ దాదాపుగా ఆ తరహా పాతత్రల చుట్టూనే తిరిగింది. అయితే ఇప్పుడు ఆ గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా మరో కొత్త రకమైన ఇమేజ్ ఆమెకు లభిస్తుందని సిండ్రెల్లా చిత్ర వర్గాలు అంటున్నాయి. తమిళంలో నీయా-2 (నాగకన్య), తెలుగులో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రాల తర్వాత ఇప్పుడామె సిండ్రెల్లా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి వినో వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా దెయ్యం కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని, అయితే రెగ్యులర్ దెయ్యపు చిత్రాలకు భిన్నంగా చాలా స్పీడ్ చిత్రంగా దీనిని మలుస్తున్నారట. ఇందులో ఆమె పోషించిన పాత్ర కొత్త ఇమేద్‌ను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇదిలావుండగా…హిందీలో ఆమె నటించిన జూలీ-2, తమిళంలో నీయా-2, తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి. దాంతో మంచి విజయం కోసం ఆమె ఎదురుచూస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్న సిండ్రెల్లా చిత్రమైనా తనకు కెరీర్ పరంగా మేలు చేకూరుస్తుందని, తన నటనను మరో కోణంలో చూసే అవకాశాన్ని కల్పిస్తుందని ఆమె నమ్మకంతో ఉంది. తప్పకుండా ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రం అందిస్తుందన్న అభిప్రాయాన్ని చిత్ర వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa