హీరో శర్వానంద్ హీరోయిన్స్ .కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ నటించిన చిత్రం రణరంగం. 1990 నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు..ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ డాన్ గా నటిస్తున్నాడు.. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది.. ఈ చిత్రానికి సుధీర్‌వర్మ దర్శకుడు. తాజాగా ఈ మూవీలోని సీతా కళ్యాణం సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలాజీ రాసిన ఈ గీతాన్ని శ్రీహరి ఆలపించాడు.. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa