ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగవ్వ సరదా ప్రశ్నలకు చిలిపి సమాధానాలిచ్చిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2019, 08:06 PM

హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే ఎంతో ప్రచారం కావాలి. సినిమాకి ప్రచారం ఎంత బావుంటే అంత ఓపెనింగ్స్ వస్తాయి. అందులోనూ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమాంత ఓ బేబీ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే ఆ సినిమా టీజర్లు, ట్రైలర్లు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇక సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ మరింత ప్రచారం చేయడానికి సిద్ధమయింది యూనిట్. నందినీ రెడ్డి సినిమాల్ని ప్రమోట్ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటారు. అదే పని ఓ బేబీ కోసం కూడా చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ కోసం సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకునే గంగవ్వతో సరదా ఇంటర్వ్యూ చేయించారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. గంగవ్వ అడిగిన సరదా ప్రశ్నలకు సమంత చిలిపి సమాధానాలు అభిమానులకు తెగ నచ్చేశాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa