భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో చూసుకున్నా హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు ఒకింత ఇంట్రెస్ట్ గానే ఉంటాయని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎన్ని సినిమాలు ఎన్ని పాత్రలు చేసినప్పటికీ ఒక్క సినిమా చాలు ఆ హీరోయిన్ ని ఓవర్ నైట్ లో స్టార్ ని చేసి పెడుతుంది. ఇలా ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్స్ మాత్రమే కెరీర్ పరంగా మంచి హైట్స్ చూడగలిగారని చెప్పాలి.కాగా గత ఏడాది వచ్చిన యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. అయినప్పటికీ ఆ సినిమాలో సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే తన కంటే ముందు ఓ రేంజ్ లో స్టార్డం ని సొంతం చేసుకున్న హీరోయిన్ మాత్రం సౌత్ కు చెందిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి అని చెప్పొచ్చు.పాన్ ఇండియా హిట్ చిత్రం కేజీఎఫ్ 1 లో నటించిన ఈమె అందరి దృష్టిని మొదట బాగా ఆకర్షించింది. కానీ పార్ట్ 2తో మాత్రం ఒక్కసారిగా శ్రీనిధి శెట్టి ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయారు. ఇలా అక్కడ నుంచి మంచి క్రేజ్ ని శ్రీనిధి శెట్టి సొంతం చేసుకోగా కేవలం కన్నడ సినిమాలే కాకుండా ఇతర భాషల్లో కూడా గట్టి ఆఫర్లు అందుకుంది.