ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్య‌ధిక పారితోష‌కం పొందుతున్న ప్ర‌పంచ న‌టుల్లో అక్ష‌య్‌కి చోటు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 11, 2019, 03:45 PM

ప్రపంచంలోని అత్యధిక పారితోషికం పొందిన నటుల జాబితా  ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది. ఈ  జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. అలాగే  మరో 99 మంది అంతర్జాతీయ ప్రముఖులలో   రిహన్న, జాకీ చాన్, స్కార్లెట్ జోహన్సన్, క్రిస్ ఎవాన్స్ , కాటి పెర్రీ  లాంటి అంతర్జాతీయ న‌టులు ఉన్నారు. వీరంద‌రినీ అధిగమించిన అక్ష‌య్  65 మిలియన్ల విలువైన ఆదాయంతో 33 వ ర్యాంకును పొందాడు. 


ఫోర్బ్స్  ప్ర‌చురించిన ప్రకారం,  అక్ష‌య్ ఒక చిత్రానికి 10 మిలియన్ల వరకు సంపాదించుకుంటాడ‌ని, అలాగే . టాటా  , హార్పిక్‌లతో సహా 20 బ్రాండ్‌ల ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టించి పెద్ద ఎత్తున త‌న సంపాద‌న పెంచుకున్న‌ట్టు చెప్పింది.  


ఇటీవలి సంవత్సరాలలో ఈ జాబితాలో రెగ్యులర్‌గా ఉన్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది టాప్ 100 లో చోటు దక్కించుకోలేక పోవ‌టం విశేషం.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa