బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా అసిస్టెంట్ డైరక్టర్ చారిట్ దేశాయ్ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. సహజీవనం గురించి రెండేళ్ల నుంచి ఎన్నిరకాల పుకార్లు వచ్చినా పరిణితీ వాటిపై ఎటువంటి కామెంట్ చేయలేదు.ఆ పుకార్లు అబద్దమంటూ ప్రకటించలేదు అలాగని నిజమేనని చెప్పలేదు. అయితే తొలిసారిగా ఇటీవల సహజీవనం పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రా స్పందించింది. నిజమేంటో తన కుటంబ సభ్యులకు,స్నేహితులకు తెలుసునని చెప్పింది. మిగతావాళ్లు ఏమనుకున్నా తాను పట్టించుకోనని చెప్పింది.
తాను, చారిట్ దేశాయ్ ఏదో ఒక ప్రకటన చేస్తామని మీడియా భావించిందని కానీ అది తన పర్శనల్ లైఫ్ అని,అందుకే ఆ పుకార్లను సమర్థించను,కొట్టిపారేయనని తెలిపింది. గతేడాది నవంబర్ లో జరిగిన ప్రియాంక చోప్రా,నిక్ జోనస్ ల పెళ్లిల్లో పరిణితీ చోప్రా, చారిట్ దేశాయ్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa