ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 03:44 PM

టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్. కేజీఎఫ్, సాలార్ వంటి సూపర్‌హిట్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం నటీనటులు మరియు సిబ్బందిని ఖరారు చేసే పని శరవేగంగా జరుగుతోంది మరియు ఈ ప్రాజెక్ట్‌లో ఎవరు భాగం అవుతారో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రుక్మిణి వసంత్ ఈ చిత్రానికి కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. మలయాళ నటుడు బిజు మీనన్ విలన్‌గా నటిస్తారని, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రం యొక్క షూటింగ్ ని ఫిబ్రవరి రెండవ వారం నుంచి ప్రారంభించటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని జనవరి 9, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa