ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ సబ్బవరం కొత్త మూవీ ఇదే.. K - RAMP...

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 01:03 PM

“క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. అదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు దిల్ రుబా సినిమాను చకచక ఫినిష్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానుంది.. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా నేడు కిరణ్ అబ్బవరం మరో సినిమాను ప్రకటించాడు. తన కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమాకు సంబంధించి నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించారు. దాంతో పాటుగా చిత్ర టైటిల్ ను కూడా వెల్లడించారు మేకర్స్. ఈ సినిమాకు ‘K’ RAMP అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై టీమ్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించనున్నారు నిర్మాత రాజేష్ దండా. ఈ సినిమాకు సంబందించిన ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa