‘క్షణం’ సినిమా విడుదలకాక ముందు వరకూ నిర్మాతలందరూ తనని విలన్‌గానే చూశారు తప్ప, ఒక యాక్టర్‌గా చూడలేదని అన్నారు అడవిశేష్. రెజీనాతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను నటి సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ‘‘నన్ను హీరోగా నమ్మిన మొదటి నిర్మాత పీవీపీ గారు. ఆ సమయంలో మహేశ్ సర్, సామ్‌లకు నాపై ఉన్ననమ్మకంతో టీజర్‌ను విడుదల చేశారు. సమంత చేతి చలవతో నాకన్నీ శుభాలే జరిగాయి.
ఆమె ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల టీజర్స్‌ని విడుదల చేశారు. ఆ రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు ‘ఎవరు’ టీజర్‌ని కూడా ఆమె విడుదల చేయడం ఆనందంగా ఉంది. నాకు సినిమా అంటే పిచ్చి. అంతకుమించి గౌరవం. ‘ఎవరు’ స్టోరీ బాగా నచ్చింది. రామ్‌జీ చెప్పిన వెంటనే ఒప్పుకొన్నా. సినిమా విడులవుతుందగానే, అందరూ ‘గూఢచారి’లా ఉంటుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ చిత్రం ‘గూఢచారి’ జానర్‌తో పోలిస్తే, ‘క్షణం’కు దగ్గరగా ఉంటుంది. ఇది ఒక థ్రిల్లర్’’
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa