ఓటీటీలో థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ మూవీస్ కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఈ జానర్ సినిమాలు ఏ భాషలో వచ్చిన ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా నెట్‌ఫ్లిక్స్ లోనూ ది టీచర్ (The Teacher) పేరుతో ఓ మలయాళం మూవీ ఉంది. అమలా పాల్ నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే చూసేయండి.మలయాళం మూవీ ది టీచర్.. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైంది. వివేక్ డైరెక్ట్ చేశాడు. అమలా పాల్ లీడ్ రోల్లో నటించింది. ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె నటించిన మూవీ ఇది. డిసెంబర్, 2022లో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది.తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఓ టీచర్.. తనకు అన్యాయం చేసిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న కథ ఆధారంగా ఈ మూవీని తీశారు. ఇదొక డిఫరెంట్, పక్కా మలయాళం మార్క్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa