ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'సత్యం సుందరం'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 02:23 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' తెలుగులో 'సత్యం సుందరం' అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ హిట్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో  తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీలో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్ లోనే 4.78 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారాం. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa