దయా రచన మరియు దర్శకత్వంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన 'బాపు' చిత్రం ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. ఈ డార్క్ కామెడీ-డ్రామా హాస్యం మరియు భావోద్వేగాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రానికి విడుదలైన అన్ని చోట్ల్స్ మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టికెట్ వివరాలని వెల్లడించారు. సింగల్ స్క్రీన్ కి 99 మరియు మల్టీప్లెక్స్ కి 149 రూపాయల టికెట్ ధరల్ని ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల మరియు అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజు మరియు భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమానిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వాసు పెండెమ్ (సినిమాటోగ్రఫీ), ఆర్ఆర్ ధ్రువన్ (మ్యూజిక్) మరియు అనిల్ ఆలయం (ఎడిటింగ్) తో కూడిన సాంకేతిక బృందం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa