సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ఆయన చేస్తేనే బావుంటుందని భావించిన మేకర్స్ హరీష్ శంకర్‌ను ఒప్పించారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలె పూర్తి చేశారు. నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ ‘ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాం. అడగ్గానే మా చిత్రంలో అతిథి పాత్రలో నటించిన హరీష్ శంకర్‌కు కృతజ్ఞతలు’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa