ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఛావా’ కి కొన్ని రాష్ట్రాల అండ

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:24 PM

చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని భావోద్వేగానికి గురి చేసిన చిత్రం 'ఛావా’. శంభాజీ మహారాజ్‌  జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి  దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లబిస్తుంది. ఆ పోరాట యోధుడి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్‌ తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా అందరికీ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల  ప్రభుత్వాలు దీనికి పన్ను మినహాయింపునిచ్చాయి.‘ఛావా’కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా పన్ను మినహాయింపును ప్రకటించింది. బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సినిమాకు మరింత ఆదరణ దక్కాలని ఆయన అన్నారు. అలాగే గోవాలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మహారాష్ట్రలోనూ ఈ సినిమాకు పన్ను మినహాయింపు  కలిగించాలని వస్తున్న విజ్ఞప్తుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారు. ‘‘ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితంపై గొప్ప సినిమా తీసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సినిమాను చూడలేదు. చరిత్రను ఎక్కడా వక్రీకరించకుండా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తాం’’ అని అన్నారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa