టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని రంగాల్లో ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. సంక్రాంతికి వస్తున్నాం ఎఫ్2 ఫుల్ రన్ కలెక్షన్లను అధిగమించడంతోపాటు పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం యొక్క OTT మరియు శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ మరియు జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే. చలన చిత్రం యొక్క ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ శనివారం అంటే మార్చి 1న సాయంతరం 6 గంటలకి జీ తెలుగులో జరగనుండగా, డిజిటల్ ప్రీమియర్ కూడా మార్చి 1న సాయంతరం 6 గంటలకి జీ5లో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa