మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా కొత్త టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు అద్భుతమైన నటనతో పాటు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్, ఆఖరిలో ప్రభాస్ లుక్ హైలైట్ అని చెప్పాలి. కాగా, ఇప్పటికే విడుదలైన శివ శివ శంకరా పాటకు పాజిటివ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రం యూనిట్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa