నేచురల్ స్టార్ నాని కోర్టు పేరుతో ఒక చిత్రాన్ని సమర్పిస్తున్నారు. స్టేట్ vs నో బాడీ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన లభించింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్మెంట్ కోసం వెన్యూ ని ఖరారు చేసారు. దుండిగల్ లోని MLRIT కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఈరోజు సాయంతరం 5:04 గంటలకి రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. నూతన దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు కాగా, దినేష్ పురుషోత్తమన్సి నిమాటోగ్రఫీని, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి 14న ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa