ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 14న విడుదల కానున్న ‘దిల్‌రూబా’

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 12:13 PM

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా విశ్వకరుణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక. రవి, జోజో జోస్‌, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. ఈ నెల 14న హోలీ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా, ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు మేకర్స్‌. ‘కన్నా.. నీ ప్రేమ సంద్రమే. నేను నీ తీరమే. కన్నా.. నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే’ అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌, విశ్వకరుణ్‌ రచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa