ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా కానుకగా 'అఖండ 2'

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 12:20 PM

నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సినిమా  'అఖండ 2: తాండవం'. వీరిద్దరి కలయికలో వస్తున్న నాల్గవ సినిమా ఇది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని  ఎక్స్ ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయని చెబుతున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది.  ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు,  దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa