ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లారు.

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 08:09 PM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లారు. ఈ విషయాన్ని అల్లు ఫ్యామిలీ సన్నిహితుడు నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. కేరళలోని ఓ ప్రఖ్యాత వెల్ నెస్ సెంటర్ ను అల్లు అరవింద్ సందర్శిస్తారని బన్నీ వాసు తెలిపారు. ఈ వెల్ నెస్ సెంటర్ లో బరువు తగ్గేందుకు ప్రకృతి చికిత్సలు ఉంటాయని వివరించారు. అల్లు అరవింద్ ఈ సెంటర్ లో కొన్నాళ్ల పాటు చికిత్స పొందుతారని పేర్కొన్నారు. కాగా, అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఛావాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హిస్టారికల్ మూవీ తెలుగులో మార్చి 7న థియేటర్లలోకి రానుంది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహరాజ్ గా అద్భుత నటనను ప్రదర్శించాడు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa