స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల తన తదుపరి సినిమాని సందీప్ రాజ్ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'మోగ్లీ' పేరుతో అతని ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితం ప్రారంభించబడింది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ఈ చిత్రం 2025లో వేసవి కానుకగా విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా నుండి మేకర్స్ స్పెషల్ వీడియోని విడుదల చేయగా, భారీ స్పందనను అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని మేకర్స్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కి సంబందించిన పిక్స్ ని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ చిత్రంలో సాక్షి మధోల్కర్ కథానాయికగా నటిస్తుండగా, కాలభైరవ సంగీత దర్శకుడు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa