ఆర్టిస్టులను చూపించకుండా కేవలం కథ, కథనాల మీద ఆధారపడి తీసిన సినిమా ‘రా రాజా’. బి.శివప్రసాద్ దర్శకుడు. ఈ నెల 7 న విడుదలవుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైమ్‌లో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చి, అనుకోకుండా నేనే దర్శకుడినయ్యా. సినిమా బాగా వచ్చింది’ అన్నారు. ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చే అవకాశం లభించిందని సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, సినిమా బాగా వచ్చిందని ఛాయాగ్రాహకుడు రాహుల్ శ్రీవాత్సవ్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa