బిగ్‌బాస్ షోలో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు పితూరీలు చెప్పుకోవడం, హేళన చేయడం మొదలైంది. హౌస్‌లోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా పోతోంది. ఒకరిని ఒకరు హేళన చేసుకుంటూ, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ.. ఇలా సాగుతోంది షో.
ప్రస్తుతం ఎలిమినేషన్‌లో ఉన్న హేమ చేసిన టీ నీళ్లలా ఉందని, చక్కెర తక్కువైందని పోటీదారులు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుణ్ సందేశ్-వితికా షెరు జంట రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇక, బిగ్‌బాస్ ఇచ్చిన కామెడీ టాస్క్‌తో హౌస్‌లోని కంటెస్టెంట్‌లు అందరూ చిన్నపిల్లలైపోయారు. ఈ టాస్క్‌లో యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్ విట్టా మాత్రం పాల్గొనలేదు. తనకు ఓవర్ యాక్షన్ చేయడం ఇష్టం ఉండదని, సైలెంట్‌గా ఉంటానని ఓ పక్కన ఉండిపోయాడు.
ఇది చూసిన రవికృష్ణ, రోహిణిలు మహేశ్‌ను ఉద్దేశించి ‘కర్రిగాడు ఊడపొడుస్తానన్నాడు, ఇప్పుడేమో పడుకున్నాడు’ అంటూ హేళన చేశారు. ఆ మాటలు విన్న మహేశ్ బాధపడి సీరియస్ అయ్యాడు. తనను గాడు, గీడు అన్న పర్లేదు కానీ, కర్రోడు అంటే బాగుండదని వారిని హెచ్చరించాడు. దీంతో రవికృష్ణ సారీ చెప్పాడు. మహేశ్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచీ ఇలానే ఉన్నానని, తనకు నచ్చని పని చేయనని చెప్పుకొచ్చాడు. తనను వాడు, వీడు అన్నా పర్లేదు కానీ, కర్రోడు అంటే కోపం రాదా? అని ప్రశ్నించాడు. పునర్నవి సర్ది చెప్పడంతో మహేశ్ శాంతించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa